తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన తాజా సినిమా ‘తండేల్’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా చిత్ర నిర్మాతలు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా చిత్ర డబ్బింగ్ సమయంలో సాయి పల్లవి డైరెక్టర్ చందు మొండేటితో చేసిన అల్లరి ఓ వీడియో రూపంలో అభిమానుల ముందుకు వచ్చింది. తాను డబ్బింగ్ చెబుతుంటే దర్శకుడు చందు మొండేటి ఏవో కామెంట్స్ చేస్తున్నాడని.. తనవైపు కెమెరాలు పెట్టి మరీ షూట్ చేయడం ఏమిటని డైరెక్టరని గట్టిగానే ప్రశ్నించింది.
దీంతో చందు మొండేటి ఆమెకు దండం పెడుతూ, ఆమెతో కష్టం అంటూ సరదాగా కామెంట్లు చేశాడు.