డీల్‌ పూర్తయ్యింది!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే నెక్స్ట్ లెవెల్ హైప్ ని అందుకోగా మేకర్స్ రీసెంట్ గానే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇక తారక్ కూడా ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్ లో పాల్గొననుండగా ఆల్రెడీ ఈ సినిమాకి బిజినెస్ పనులు పూర్తవుతున్నాయి.

ఇలా ప్రస్తుతం నార్త్ అమెరికాకి చెందిన థియేట్రికల్ డీల్ పూర్తయ్యిపోయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. పలు భారీ చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ప్రత్యంగిరా వారు ఈ చిత్రాన్ని భారీ మొత్తంలో సొంతం చేసుకొని అక్కడ రిలీజ్ చేసేందుకు లాక్ చేసుకున్నారు. దీంతో ఇంకా తారక్ సెట్స్ లోకి కూడా అడుగు పెట్టకుండానే బిజినెస్ ని ఈ చిత్రం క్లోజ్ చేసుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories