తేదీ మారిందా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా  ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌ లో ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన కంటెంట్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనే విధంగా ఉండటంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పుడు అభిమానుల్లో ఈ సినిమా విడుదల తేదీ పై సందిగ్ధత నెలకొంది. అసలు ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేస్తారా లేక 25న చేస్తారా అనే డౌట్ వారిలో ఏర్పడింది. ఒకవేళ ఈ మూవీ విడుదల తేదీ మారిందా అంటూ వారు చర్చించుకుంటున్నారు.

మరి ‘గేమ్ ఛేంజర్’ మూవీ విడుదల తేదీపై మేకర్స్ ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories