ఫస్ట్ సింగిల్ కి డేట్, టైం ఖరారయ్యాయి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ  “హరిహర వీరమల్లు” . ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా పవన్ నుంచి క్రేజీ పీరియాడిక్ సినిమాగా అభిమానుల ముందుకు రాబోతుంది. అయితే గతకొన్ని రోజులు నుంచి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అనే టాక్‌ వినపడుతుంది.

కానీ మూవీ మేకర్స్ ఫైనల్ గా దీనిపై సాలిడ్ అప్డేట్ ని అయితే ఇచ్చారు. పవన్ ఆలపించిన ఈ పాటని ఈ జనవరి 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వీరమల్లు మ్యూజిక్ ఎట్టకేలకు మొదలైందని చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories