హ్యాట్రిక్‌ పై కన్నేసిన ముద్దుగుమ్మ!

హ్యాట్రిక్‌ పై కన్నేసిన ముద్దుగుమ్మ! నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అయిపోయింది. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో ఆమెకు సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. దీంతో స్టార్ హీరోలందరూ ఆమెతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌ గా ఉంటున్నారు. ఇక తాజాగా ‘పుష్ప 2’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప 2’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గతేడాది ‘యానిమల్’ మూవీలో రణ్‌బీర్ కపూర్ సరసన హీరోయిన్‌గా రష్మిక యాక్ట్‌ చేయగా.. ఆ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్‌బస్టర్స్ అందుకున్న రష్మిక, ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న గ్రాండ్ విడుదల కాబోతుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మహారాణి యేసు భాయి పాత్రలో నటిస్తోంది. దీంతో ఈ సినిమాతో రష్మిక ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories