సెన్సార్‌ ముగించుకున్న పరదా!

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘పరదా’ రిలీజ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ సోషల్ డ్రామా గురించి మొదటి నుంచి మంచి చర్చ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేపాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సామాజిక అంశాలతో కూడిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. కుటుంబం నుంచి యువత వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా కనెక్ట్ చేస్తుందని యూనిట్ విశ్వాసంగా చెబుతోంది. ముఖ్యంగా అనుపమ పోషించిన పాత్రకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

అనుపమతో పాటు దర్శనా రాజేంద్రన్, సంగీత వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆగస్టు 22న థియేటర్లలోకి రానున్న ‘పరదా’ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories