జూనియర్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్‌!

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘జూనియర్’ సినిమా ఇప్పటివరకు మంచి స్పందనను అందుకుంటోంది. కిరీటీ అనే కొత్త హీరోతో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా మెరిసింది. వీరిద్దరి కాంబినేషన్‌కు తోడు సినిమాలోని పాటలు, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.

ఈ సినిమాకు రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించగా, జూలై 18న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ముఖ్యంగా కిరీటీ చేసిన యాక్షన్ సీన్స్, డాన్స్ మూవ్స్ గురించి చర్చ జరుగుతోంది.

ఇక ఈ సినిమాతో జెనీలియా టాలీవుడ్‌కి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన పాత్ర స్ట్రాంగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి వీకెండ్‌కి బుక్ మై షోలో వేల కొద్దీ టికెట్లు బుక్కవడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, ‘జూనియర్’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చింది. మొత్తంగా చెప్పాలంటే, కొత్త హీరో కిరీటీకి ఇది మంచి డెబ్యూట్ అయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories