తమిళ స్టార్ నటుడు ధనుష్ కు కోర్టులో ఊరటలో లభించింది. గత కొంతకాలంగా ధనుష్ తమ కొడుకే అంటూ కదిరేశన్, మీనాక్షి అనే వారు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. సుమారు 8 సంవత్సరాల క్రితం మధురైలో ఈ కేసు మొదలైంది. సినిమాల మీద ఉన్న ఇష్టంతో ధనుష్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు…వారు అప్పటి నుంచి వెతుక్కుంటూ ఉంటే చాలా సంవత్సరాల తరువాత దొరికినట్లు తెలిపారు.
అప్పుడు ధనుష్ దగ్గరకు వెళ్లి తమ కొడుకే అని చెబితే ఆయన కాదు ..కూడదు అనడంతో వారు కోర్టుకు ఎక్కడంతో పాటు నెలకు రూ. 65 వేలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ధనుష్ మాత్రం వారు తన తల్లిదండ్రులు కాదని తన అసలైన తల్లిదండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి అని , తన నుంచి డబ్బులు తీసుకునేందుకు వారు ఇలా తప్పుడు కేసు పెట్టారని చెప్పుకొచ్చాడు.
ఇలా 8 ఏళ్లు కేసు నడుస్తుంది. తాజాగా ఈ కేసును కోర్టు కొట్టివేసింది. కదిరేశన్, మీనాక్షి చూపించిన ఆధారాలు సరైనవి కాదని చెప్పింది. కదిరేశన్ దంపతులు వేసిన పిటిషన్ లో ధనుష్ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు గురించి చెప్పగా.. అవి అన్ని తప్పుడు ఆధారాలు తేలింది.
దీంతో మధురై కోర్టు కదిరేశన్ దంపతులు వేసిన పిటిషన్ ని కొట్టేసింది. ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులు కుమారుడే అని తేల్చి చెప్పింది.