పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్, ఇప్పుడు మరో మాస్ ఎంటర్టైనర్తో మన ముందుకు రాబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ది రాజా సాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మీద మంచి హైప్ ఏర్పడింది. హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇక ఈ సినిమా నుంచి తొలిసారిగా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. జూన్ 16న హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్లానింగ్ చూస్తే, టీజర్ లాంచ్ ఒక్క నిమిషం కూడా సాధారణంగా ఉండబోదని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు కారణం అక్కడ 35 అడుగుల ప్రభాస్ స్పెషల్ కటౌట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇది చూసేందుకు, టీజర్ లైవ్ చూడాలనే ఉత్సాహంతో అభిమానులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా కోసం థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన గతంలో మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే బీట్లతో హిట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లు మ్యూజిక్ కూడా ఉంటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి టీజర్ విడుదలకు ముందు నుంచే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. టీజర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.