జగన్ బాటను ఫాలో కావడం వల్లే పులివెందుల ఘర్షణలు!

యథా రాజా తథా ప్రజా అంటారు పెద్దలు. పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించే విధానాలు ఎలా ఉంటాయో.. ఆయన పార్టీ వారందరూ కూడా అదే బాటలో నడుస్తారు? ఆయన తప్పుడు మార్గం నిర్దేశిస్తే వారందరూ కూడా అదే తప్పుడు దారిని తొక్కుతారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి.. ఎలాంటి పనులు చేస్తున్నారో.. ఆయన అనుచరులంతా అదే చేస్తున్నారు. ప్రస్తుతానికి జగన్ జీవితంలో ఏకైక లక్ష్యం.. రాష్ట్రంలో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడమే ఆయన ఎజెండా. ప్రతిసారీ యాత్ర నిర్వహించినప్పుడు అదే ఎజెండా మీద పనిచేస్తుంటారు. ప్రెస్ మీట్ పెట్టినా కూడా.. అందుకోసం రెచ్చగొట్టే మాటలను మాత్రమే బయటకు వదులుతుంటారు. ఇప్పుడు పులివెందులలో ఆయన ఫాలోయర్స్ కూడా.. శాంతి భద్రతల విచ్ఛిన్నమే ఎజెండాగా పనిచేస్తున్నారు. ఘర్షణలకు కారణం అవుతున్నారు.

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరుగుతోంది. నల్లగొండువారిపల్లెలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. అయితే.. ఈ ఘర్షణలు ఎలా జరిగాయో అసలు వాస్తవం ఇప్పుడు బయటకు వస్తోంది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే.. ఎన్నికల బరినుంచి తప్పుకునేందుకు వైసీపీ తాపత్రయ పడుతున్నట్టుగా కనిపిస్తోందని రామగోపాల్ రెడ్డి అన్నారు. 

నిజానికి ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న పులివెందుల వంటి చోట ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఎన్నికల నియమావళిలో స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. పోలీసులు అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో ఒక పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు.. ఆ సమయానికి మరొక పార్టీ అక్కడ ప్రచారం నిర్వహించకూడదనే నియమం ఉంది. ఎక్కడ ఎవరు ఎప్పుడు ప్రచారం చేసుకోవాలో పోలీసులు ముందుగానే సమయం కేటాయిస్తారు. ఆ ప్రకారంగా బుధవారం నల్లగొండుపల్లెలో తెలుగుదేశం ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంది. వారు ప్రచారానికి వెళ్లారు.

కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు వారితో ఘర్షణలకు దిగారు. ఇది చట్టవిరుద్ధం అని భూమిరెడ్డి అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ వారు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే.. జగన్ వాళ్లకు అదే మార్గాన్ని ఉపదేశిస్తున్నారు. తన చర్యలతో కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించడమే తమందరి ఎజెండా అనే సంకేతాలు ఇస్తున్నారు. నల్లగొండుపల్లెలో ఘర్షణలు జరగబట్టే.. తెలుగుదేశం వారు దాడులు చేసి చంపేస్తున్నారంటూ వారు నానా గోల చేయడానికి అవకాశం దక్కుతోంది.. ఇదంతా ఒక వ్యూహాత్మక స్కెచ్ ప్రకారం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories