పోలీసులపై కేసు అంటే ఈ నాయకులకు వణుకెందుకు?

‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనేది సాధారణంగా నాయకులు వాడుతూ ఉండే ఒక అద్భుతమైన డైలాగు. అయితే నాయకులు కేవలం తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ డైలాగు వాడుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం వేరేగా ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారితో కుమ్మక్కు అయి.. వారి పట్ల భక్తితో చెలరేగిపోయి.. దారి తప్పి నడుచుకున్న అధికారుల తప్పిదాలు బయటకు వస్తుండగా.. వారి మీద చర్యలు తీసుకోవడానిక ప్రభుత్వం ఉపక్రమిస్తోంటే.. వణుకు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.

కుక్కల విద్యాసాగర్ – కాదంబరి జత్వానీకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు విచారణ మొదలు కాబతున్నది. ఈ నేపథ్యంలో అప్పట్లో అతిచేసిన ఐపీఎస్ అధికారులు ముగ్గురూ తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. విచారణ వారికి అయితే.. ఖండన, ఆవేదనలు మాత్రం వైసీపీ నాయకులనుంచి వస్తున్నాయి. ఆ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముంబాయి నటి కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు పెట్టబోతున్నారంటూ  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. కానీ కొత్త సంప్రదాయాలకు తెరతీయవద్దు’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిస్తున్నారు. ఈ మాట అనడం ద్వారా ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. పోలీసు అధికారులు.. తాము పోలీసులం కదా అనే అహంకారంతో.. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినా సరే.. వారి ఘోరాల గురించి పట్టించుకోకుండా విడిచిపెట్టాలా? అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. చంద్రబాబునాయుడు సర్కారుతో సన్నిహితంగా మెలిగారనే ఏకైక కారణంతో.. పలువురు పోలీసు అధికారులను వేధించారు. వారు చేసిన నేరాలు ఏమీ లేకపోయినా కూడా వారి మీద కేసులు పెట్టారు. విచారణలు సాగించారు. ఇప్పుడేమో కొత్త సాంప్రదాయాలకు తెర తీయవద్దు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

బహుశా.. తప్పు చేయకపోయినా సరే కేసులు పెట్టి వేధించడం తమ సాంప్రదాయం అని, తప్పు చేసిన వారి మీద కేసులు పెట్టడం కొత్త సంప్రదాయం అని అంబటి భావిస్తున్నట్టుగా ఉంది. మొత్తానికి కాదంబరి జత్వానీ పట్ల అనుచితంగా వ్యవహరించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు విచారణ ఎదుర్కొంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పలువురి బండారం బయటకు వస్తుందని అంబటి భయపడుతున్నట్టుగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories