పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఓజిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుజీత్ మెగాఫోన్ పట్టారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తూ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సినిమా మొదటి రోజు షో కోసం అభిమానుల్లో పెద్ద ఎత్తున క్రేజ్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఓజి సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రిలీజ్‌కు వారం రోజులు ముందే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
గుంటూరు ప్రాంతంలో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్ సేల్ మొదలైంది. సెప్టెంబర్ 25న అర్థరాత్రి 1 గంట, 1.15 గంటలకు ప్రత్యేక షోలు ప్లాన్ చేయడంతో అభిమానులు వేగంగా బుకింగ్ చేసుకుంటున్నారు.