తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. అయితే, మార్చి 27 ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. కొన్ని సమస్యలు తలెత్తడంతో ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో మరి ఈ సినిమా నేడు రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్ర రిలీజ్‌కు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయాయని.. నేటి సాయంత్రం నుంచి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు.
దీంతో విక్రమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.