పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న పెద్ద సినిమా ఎప్పుడొస్తుందా అని చాలా కాలంగా ఆత్రుతగా ఉన్నారు. గతంలో విడుదలైన హరిహర వీరమల్లు అనేక సార్లు వాయిదా పడటం వల్ల ప్రేక్షకుల అంచనాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు అందరి దృష్టి మాత్రం ఓజి మీదే ఉంది.
ఈ సినిమా కోసం అభిమానులతో పాటు మొత్తం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కి ఇంకా సమయం ఉండగానే, ట్రేడ్ వర్గాల్లో మొదటి రోజు కలెక్షన్ల గురించి చర్చలు జోరుగా మొదలయ్యాయి. ఓజి మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించగలదని లెక్కలు వేస్తున్నారు. అంతేకాకుండా, వీరమల్లుతో మిస్ అయిన 100 కోట్ల షేర్ రికార్డును పవన్ ఈ సినిమా ద్వారా తప్పక సాధిస్తాడని అంచనాలు ఉన్నాయి.