మాస్ ఫీస్ట్ ఇచ్చిన ‘కరుప్పు’

తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి మాస్ మూడ్‌లోకి వచ్చేశాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త చిత్రం కరుప్పు అంటూ ఓ పవర్‌ఫుల్ టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన స్పెషల్ గిఫ్ట్ అనేలా ఫ్యాన్స్‌కి పెద్ద ఖుషి ఇచ్చింది. సూర్య గతంలో చేసిన ఇంటెన్స్ మాస్ రోల్స్‌కి ఇది మరో అడుగు ముందుకెళ్లిన లుక్ తో కనిపించింది.

ఈ సినిమాలో సూర్య పాత్ర పూర్తిగా పవర్‌ఫుల్ లాయర్‌గా ఉండేలా కనిపిస్తోంది. కోర్ట్‌లో కానీ, బయట కానీ, చాలా అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ఉండే కేరెక్టర్లో ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. మాస్స్‌తో పాటు ఎంటర్‌టైన్మెంట్ టచ్ కూడా మిక్స్ చేసినట్టు ఆ టీజర్ చూపిస్తుంది. చాలా కాలం తర్వాత ఎనర్జీగా, డైనమిక్‌గా కనిపిస్తున్న సూర్య ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్ అన్న మాట.

విజువల్స్ కూడా టీజర్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. స్కోర్లో సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా మూడ్‌ను ఎలివేట్ చేసింది. టీజర్ మొత్తం సూర్య కోణంలోనే డిజైన్ చేసినట్టే కనిపించింది. ఆయన ఎంట్రీలతో, డైలాగ్ డెలివరీతో మాస్ ప్రేక్షకుల మనసు దోచేసేలా ఉంది. మొత్తానికి కరుప్పు టీజర్ చూస్తే ఈ సినిమా కూడా సూర్య కెరీర్‌లో మరో ఇంటెన్స్ మాస్ హిట్‌గా నిలవబోతోందనే హింట్ స్పష్టంగా కనిపిస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories