ప్రభాస్‌ కోసం దేనికైనా సై అంటున్న బ్యూటీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రభాస్, ఆ తర్వాత కల్కి 2, సలార్ 2, స్పిరిట్ లాంటి భారీ సినిమాలను కూడా సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్‌తో కలిసి నటించాలని ఒక స్టార్ హీరోయిన్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోందని తాజాగా బయటకు వచ్చింది.

టాలీవుడ్ అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒక దశలో వరుస విజయాలు సాధించి టాప్ రేంజ్‌కి చేరుకున్నా, ఆ తర్వాత బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. కానీ అక్కడ కూడా సినిమాలు సక్సెస్ కావడంతో పాటు వరుస ఫ్లాప్‌లు రావడంతో కెరీర్ దెబ్బతిన్నది. దీంతో ఇప్పుడు మళ్లీ దృష్టిని సౌత్ సినిమాలపైనే పెట్టింది. ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో మోనికా సాంగ్‌లో పూజా చేసిన డాన్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ టాలీవుడ్‌లో తిరిగి బలమైన కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. అంతేకాకుండా, ఒకవేళ ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి 3 సినిమా తీయాలనుకుంటే, ప్రభాస్ సరసన నటించేందుకు తాను ఏ స్థాయికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నానని స్పష్టంచేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories