మరియమ్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆలనాటి నటి!

యావత్‌ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా భారీ వసూళ్లు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.  ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని ఎంతో పెద్ద ఎత్తున ప్లాన్ చేసి రకరకాలుగా ప్రమోట్‌ చేస్తూ ఉంది.

ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలోని మరియ‌మ్ పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది చిత్ర బృందం. మరియ‌మ్ అనే పాత్రలో ప్రముఖ నటి శోభన నటిస్తున్నట్లుగా తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది వైజయంతి మూవీస్. సోషల్ మీడియా ఖాతా ద్వారా వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ ను అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ పోస్టర్ కు ” ఆమె లాగే తన పూర్వీకులు కూడా ఎదురు చూశారు ” అంటూ క్యాప్షన్ ను జోడించారు. దింతో ఆమె పాత్రపై అభిమానులలో మరింత ఆసక్తి  ఏర్పడింది.

Related Posts

Comments

spot_img

Recent Stories