హనుమాన్‌ నటుడితో సహజీవనంలో ఆ నటి!

టాలీవుడ్‌ లో ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విమలా రామన్‌…ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  తర్వాత మలయాళం లో ఎన్నో సినిమాలు చేసి మలయాళ భామగా అందరి దృష్టిని ఆకర్షించింది.  

హీరోయిన్ గా  గుర్తింపు దక్కకపోవడంతో రుద్రాంగి, గాండీవ దారి అర్జున వంటి ఇటీవల సినిమాల్లో ముఖ్య పాత్రలు కూడా చేసింది. కానీ అవి కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఆమె తాజాగా ఒకప్పటి హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన వినయ్ రాయ్ తో సహజీవనం చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలాకాలం నుంచి షికారులు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది.

ఇక ఈ ఇద్దరూ కలిసి చేసిన ఫోటోషూట్ ని తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో  షేర్ చేశారు.  పెళ్లి అయిన జంటలు ఫోటోషూట్ చేస్తారో అలా వీరిద్దరూ కలిసి ఫోటోషూట్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఫోటోషూట్‌తో, వారు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారని అంటున్నారు. వరుణ్ తేజ్ చిత్రం “గాండీవధారి అర్జున”లో వినయ్ రాయ్,  విమలా రామన్ భార్యాభర్తలుగా నటించగా ఇప్పుడు సహజీవనంలో లో ఉంటున్నట్టు ప్రకటించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories