తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, అతని భార్య ఆర్తి తమ కుమారుడికి పవన్ అనే పేరును పెట్టారు. ఇటీవల జరిగిన తన కుమారుడి నామకరణం, ఊయల వేడుకకు సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
పవన్…శివ కార్తీకేయన్, ఆర్తిలకు మూడవ సంతానం. ఇది వరకే వారికి ఓ కుమార్తె ఆరాధన, కుమారుడు గుగన్ ఉన్నారు. జులై 15న శివకార్తికేయన్ తన మూడవ బిడ్డకు పేరు పెట్టే వేడుక నుండి ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అతని పోస్ట్‌కి “ఆరాధన – గుగన్ – పవన్ ” అని హార్ట్ ఎమోజితో క్యాప్షన్ జత చేసాడు.ఈ వీడియోలో అతని భార్య, కుమార్తె, కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడిన కొన్ని ఫోటోలను, కార్యక్రమం క్లిప్పింగ్స్‌ను జతపరిచాడు.
జూన్ 2న ఆర్తి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒక రోజు తర్వాత శివకార్తికేయన్ తమిళం, ఇంగ్లీష్ లో ఆ విషయాన్ని పంచుకున్నారు. ఆ పోస్ట్ లో “జూన్ 2 న పుట్టిన మా కుమారుడికి స్వాగతం పలుకుతున్నప్పుడు మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. మా కుటుంబం కొంచెం పెద్దదిగా మారుతుంది. మాకు మీ అందరి ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలు కావాలి” అంటూ పోస్ట్ చేసాడు.