అందుకే ప్రభాస్‌ ని తీసుకుని రాలేదు!

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ‘కన్నప్ప’ రిలీజ్‌కు రెడీ అయింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాను డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. మోహన్ బాబు నిర్మాణం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం గ్రాండ్ ప్రమోషన్లను కూడా నిర్వహించారు మేకర్స్.

ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రభాస్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చాక అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే ప్రమోషన్లలో ఎక్కడా ప్రభాస్ కనిపించకపోవడం ఫ్యాన్స్‌కి కొంత నిరాశ కలిగించింది.

ఇటీవల మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ప్రభాస్ స్వభావం బాగా తెలుసనీ, అతడిని బలవంతంగా ప్రమోషన్లలో పాల్గొనమని అడగలేకపోయానని చెప్పాడు. అంతేకాకుండా ఒక ప్రమోషన్ వీడియో కోసం అడిగినా, చివరి క్షణంలో అది జరగలేదని తెలిపాడు.

ఈ వ్యాఖ్యలతో పాటు, విష్ణు చెప్పిన వివరాల వల్ల ప్రభాస్ ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారో ఇప్పుడు అభిమానులకు స్పష్టంగా అర్థమయ్యింది. ప్రమోషన్లలో కనిపించకపోయినా, ప్రభాస్ ఈ చిత్రంలో ఉన్నారు అన్న విషయమే ఇప్పుడు ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories