అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో మంచి సినిమాలతో దూసుకుపోతున్న నటీమణుల్లో తాప్సీ ఒకరు.ఈ సొట్ట బుగ్గల సుందరి తన సినీ కెరీర్ మొదట తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది. మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన “ఝుమ్మంది నాదం” సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత తెలుగు మరియు తమిళ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో అభిమానులను ఆకట్టుకుంది. ఆ తరవాత చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో…తెలుగులో సరైన అవకాశాలు రాక బాలీవుడ్ కి వెళ్ళింది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్ద పెద్ద స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది. అయితే బాలీవుడ్ కి వెళ్ళడానికి గల కారణాలను క్రికెటర్ శిఖర్ ధావన్ చేస్తున్న ధావన్ కరేంగే అనే చాట్ షో లో పాల్గొని తన వ్యక్తిగత విషయాలను కొన్నింటిని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్లో తన ఎంట్రీకి నటి ప్రీతి జింటాకు సంబంధం ఉందని తాప్సీ పన్ను పేర్కొంది. ఇంజనీరింగ్ చదువుతుండానే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్లు వచ్చాయి. కొన్నాళ్లకే బాలీవుడ్లోనూ ఆఫర్లు రావడం ప్రారంభం అయ్యాయి. తాను చూడడానికి కొంచెం ప్రీతీ జింటాలా ఉండడం వల్లే తనకు బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి, అందువల్లే నేను ఆమెలా ఉండడానికి ప్రయతించాను అని వివరించింది.
ఇటీవలే చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో ను మార్చిలో ఉదయపూర్లో తాప్సీ పెళ్లి చేసుకుంది.