బింబిసార అందుకే చేయలేదు!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మంచి విజయాన్ని అందించిన సినిమాల్లో బింబిసార ఒక ముఖ్యమైన చిత్రం. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రెండో భాగం దర్శకత్వం వశిష్ఠ కాదు అనీల్ పదురీకి దక్కింది. దీనిపై వశిష్ఠ స్పష్టత ఇచ్చాడు. తన కంటే అనీల్ పదురీకి ఈ కథపై మంచి ఐడియా ఉందని, ఆ పాయింట్ విన్న వెంటనే తమ టీమ్ అందరూ అతడే బెస్ట్ అని భావించారని చెప్పాడు. కళ్యాణ్ రామ్ కూడా ఈ నిర్ణయానికి ఒప్పుకున్నారని వశిష్ఠ తెలిపారు.

అందువల్ల బింబిసార 2 ని అనీల్ పదురీ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories