అన్న అంటేనే…భావోద్వేగానికి గురయ్యా!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ ఈ నెల 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ‘అన్న అంటేనే..’ అనే పాట మరింత ఎమోషనల్ కనెక్ట్‌ను తీసుకొచ్చింది. అన్నదమ్ముల బంధం చుట్టూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ పాటతో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయని, అన్న విజయ్ తనకు ఎప్పుడూ మద్దతుగా ఉండేవాడని, తన మీద అతని నమ్మకం ఎంతో గొప్పదని ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పంచుకున్నాడు. ఆ పోస్టులో చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.

ఇక ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. భాగ్యశ్రీ బొర్సే ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ‘కింగ్డమ్’ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కనెక్ట్ కలిగిన కథతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుందని మూవీ యూనిట్ విశ్వాసంగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories