సినిమా అంతే బుల్లి రాజుదే!

ఈ సంక్రాంతికి మన తెలుగు సినిమా నుంచి విడుదలైన తాజా సినిమాల్లో విక్టరీ వెంకటేష్,  ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా దర్శకుడు అనినీల్ రావిపూడి తెరకెక్కించిన భారీ హిట్‌ సినిమానే “సంక్రాంతికి వస్తున్నాం”. మరి సాలిడ్ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా  వెంకీ మామ కెరీర్ లోనే రికార్డు బుకింగ్స్ ని చూసి ఫ్యామిలీ ఆడియెన్స్ ని తెల్లవారు షోస్ తోనే థియేటర్స్ కి వచ్చేలా చేసేసింది.

అయితే అందరికీ కూడా సినిమాలో పెద్ద హైలైట్ గా బుల్లి నటుడు మాస్టర్ భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్ ఇచ్చిన ట్రీట్ మామూలు లెవెల్లో ఎంటర్టైన్ చెయ్యలేదని తెలుస్తుంది. ఫస్టాఫ్ లో తనపై అనీల్ రావిపూడి తీసిన సన్నివేశాలకి థియేటర్స్ లో ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వెంకీ మామతో కలిసి కొన్ని క్యూట్ కామెడీ సీన్స్ కూడా ఓ రేంజ్ లో అలరిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో హైలైట్ గా ఈ బాల నటుడు హాట్ టాపిక్ అయిపోయాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories