అదే నా కల!

సీనియర్ నటుడు నరేశ్‌ వీకే పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా నటి పవిత్రతో కలిసి నరేశ్‌ తన అభిమానులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ క్రమంలో విలేకర్ల సమావేశంలో నరేశ్‌ మాట్లాడుతూ…‘నా కెరీర్‌లో ఈ 2025 చాలా బాగా గుర్తుండిపోతుంది. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నాను. యువ దర్శకులు నాకోసమే రాస్తున్న పాత్రలతో… ఇటు థియేటర్‌లోనూ, అటు ఓటీటీ వేదికలతోనూ ప్రేక్షకుల్ని అలరించడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను’ అని నరేశ్‌ తెలిపారు.

నరేశ్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘మా అమ్మ విజయనిర్మల బయోపిక్‌ చేయాలనేది నా డ్రీమ్‌ . అది రాయగలిగితే నేనే రాస్తాను. అమ్మ కూడా ఆ మాటే చెప్పేవారు. అలాగే ‘చిత్రం భళారే విచిత్రం’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలకి కొనసాగింపు చిత్రాల్ని చేయాలన్నది మరో కల. కథలు రాయడం కూడా మొదలుపెట్టాను. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా ఉంది’ అంటూ నరేశ్‌ వివరించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories