దేశమంతటా ప్రజల్లో గుర్తింపు ఉండే కొద్దిమంది ప్రాంతీయ పార్టీల నాయకుల్లో చంద్రబాబునాయుడు కూడా ఒకరు. దేశంలోని ఇతర భాషల ప్రజలుండే ప్రాంతాల్లోనూ చంద్రబాబుకు కొంత ఆదరణ ఉంటుంది. అలాంటిది తెలుగువారు ఇతర ప్రాంతాల్లో నివసించే ప్రాంతాల్లో ఆయనకు అనన్యమైన క్రేజ్ ఉంటుంది అనుకోవచ్చు. మరి అలాంటి చంద్రబాబునాయుడు క్రేజ్… ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని అధికార సింహాసనంవైపు నడిపించడంలో కొంత ఉపయోగపడింది. ప్రత్యేకించి.. షహదరా నియోజకవర్గంలో ఏకంగా 32 ఏళ్ల తరువాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలవడం అనేది ఒక చరిత్ర. అలాంటిది.. ఆ నియోజకవర్గంలో ప్రధానంగా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించి ఉండడం ఇంకో చరిత్ర. ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సంజయ్ గోయల్.. తెలుగుదేశం హవాను వాడుకునే గెలిచారు.
షహదరా నియోజకవర్గంలో 1993 లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆ తర్వాత ఇక్కడ ఆ పార్టీకి ఠికానా లేదు. 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి వరుసగా హ్యాట్రిక్ కొట్టింది. 20143లో ఈ సీటు శిరోమణ అకాలీదళ్ పరమైంది. 20115, 2020లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. బిజెపికి 32 ఏళ్ల విరామం. ఈ నియోజకవర్గంలో తెలుగువారు అధికంగా ఉంటారనే గణాంకాలతో.. భాజపా ఈసారి ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ప్రచార సభలు నిర్వహింపజేసింది. చంద్రబాబుతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వేదికను పంచుకున్నారు.
ఈవేదిక మీద బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ గోయల్ ప్రజలకు ఒక చిత్రమైన హామీ ఇచ్చరు. ఆప్ పార్టీ ఢిల్లీ ప్రజలకు కానుకగా.. లిక్కర్ స్కాం ఇచ్చారని… తాను సీఎం అయితే ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు వారి స్వగ్రామాలలోని సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.
చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగువారికి కూడా తమ సొంత ఊర్లలో సమస్యలు చంద్రబాబు ద్వారా తీరుతాయనే నమ్మకం కలుగుతోంది. ఆ నమ్మకమే భాజపాను అఖండమెజారిటీతో గెలిపించింది.
చంద్రబాబునాయుడు కేవలం ఏపీ, తెలంగాణకు మాత్రమే నాయకుడు కాదు. ఆయన మీద ప్రజల్లో నమ్మకం దేశవ్యాప్తంగా ఉన్నదని ఈ ఎన్నికలు నిరూపించాయి.