హీరోయిన్లను ఆ విధంగా చూస్తారు!

హీరోయిన్ మాళవికా మోహనన్‌ కి రీసెంట్ గా ‘తంగలాన్‌’ సినిమాతో మంచి హిట్ వచ్చింది. ప్రస్తుతం ‘రాజా సాబ్‌’, ‘సర్దార్‌ 2’ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికే  డైరెక్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారంటూ అంటూ క్రేజీ కామెంట్లు చేసింది. ఇంతకీ, మాళవికా మోహనన్‌ ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే… ‘దక్షిణాది సినిమాల్లో నేను నటిస్తున్నాను. ఆ సినిమాల గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను’ అని మాళవికా మోహనన్‌ చెప్పుకొచ్చింది.

‘ముఖ్యంగా నేను ముంబైలో పెరిగా కాబట్టి, దక్షిణాది సినిమాల గురించి నా కెరీర్ మొదట్లో నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ, దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా ఇష్టపడతారు అని ఆ తర్వాత అర్ధం అయింది. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు కూడా వారి శరీర భాగాలను జూమ్ చేసి మరీ పట్టిపట్టి చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ మాళవికా మోహనన్‌ తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories