ఇండస్ట్రీ హిట్‌ అంతే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారిన చిత్రం “కన్నప్ప”. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావడం వలన సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విడుదలైన తొలి రోజే ఈ మూవీ మంచి హైప్‌ను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ ఓపెనింగ్‌ సాధించింది.

అయితే రిలీజ్ైన అదే రోజునే మేకర్స్ “ఇండస్ట్రీ హిట్” అంటూ ఓ పోస్టర్ విడుదల చేయడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. సాధారణంగా మన దగ్గర హిట్, సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ తరహాలో సినిమాలకు ట్యాగ్‌లు పెట్టే ట్రెండ్ ఉంది. కానీ ఈ లిస్టులో చివరిదైన ఇండస్ట్రీ హిట్ అనే పదాన్ని సాధారణంగా చాలా అరుదైన సందర్భాల్లో, సినిమా అన్ని రికార్డులను బద్దలుకొడితేనే వాడతారు. పైగా ఓ సినిమా ఇండస్ట్రీ హిట్ అనే స్థాయికి చేరుకోవాలంటే, అది కనీసం కొన్ని వారాలు నిలబడాలి, కలెక్షన్ల పరంగా రికార్డులు తిరగరాయాలి. కానీ కన్నప్ప విషయంలో మొదటి రోజే ఇలాంటి ప్రమోషన్‌ పోస్టర్‌ విడుదల కావడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది.

దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్ల మధ్య డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. మేకర్స్‌ ఈ పదాన్ని నిజమైన బాక్సాఫీస్ రికార్డుల నేపథ్యంలో వాడారా? లేక ఆ పోస్టర్‌ కేవలం ప్రమోషన్‌ కోసం వదిలారా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో సినిమాల ప్రమోషన్ కోసం రకరకాల పోస్టర్లు వదిలేందుకు ఒక ట్రెండ్‌గా మారింది. వసూళ్లు ఎంత ఉన్నా, ఎంత ఉన్నట్టు చూపిస్తున్నా, అసలు వాటి వెనక నిజం ఎంత ఉందనేది ప్రశ్నగా మారుతోంది.

మొత్తం మీద కన్నప్ప సినిమా మొదటి రోజు నుంచే వార్తల్లో నిలుస్తుండగా, మేకర్స్ వేసిన ఇండస్ట్రీ హిట్ పోస్టర్ మరింత హైప్‌ను పెంచినప్పటికీ, అది నిజంగా అందుకు అర్హత పొందిందా అన్నది మాత్రం ఇంకా స్పష్టతకరమైన విషయం కాదు. సినిమా నిజంగా ఏ స్థాయికి చేరుతుందో, వాస్తవ ఫలితం ఏమిటో అంటే మాత్రం మరికొంత కాలం గడవాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories