అప్పుడే ఓటీటీ సాలిడ్‌ డీల్‌!

అప్పుడే ఓటీటీ సాలిడ్‌ డీల్‌! మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెలుగు సినిమా దగ్గర ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. మరి ఇలా తెలుగు సినిమా నుంచి హిందీ సినిమాలోకి కూడా వెళ్లి అక్కడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లు ఆమె చేసింది. ఇక కొంచెం గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న అవైటెడ్ సినిమానే “ఓదెల 2”. 

తన రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ఇటీవల వచ్చిన టీజర్ తో సాలిడ్ బజ్ ని అందుకుంది. మరి ఇలా వచ్చిన ఈ టీజర్ తర్వాత మంచి ఓటిటి ధరే ఈ చిత్రానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి 11 కోట్లకి పైగా సాలిడ్ ఓటిటి డీల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం గట్టి మొత్తమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా మేకర్ పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని అతి త్వరలోనే రిలీజ్ కి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories