ఆ యంగ్‌ హీరో కూడా!

టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ కసరత్తులు చేస్తుంటే, ఆ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటికీ, ఇందులో నటించే కాస్టింగ్ విషయంలో సినీ వర్గాల్లో చర్చలు ముమ్మయ్యాయి.

తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో యంగ్ హీరో ఆకాష్ పూరి కూడా ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. ఇది జరిగితే, పూరి జగన్నాథ్ తన కుమారుడిని మరోసారి కథలో కీలకంగా నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్టే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మరోసారి వారిద్దరి కలయికలో సినిమా రాబోతోందనే వార్తతో సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది.

విజయ్ సేతుపతితో కలిసి టబు, దునియా విజయ్, నివేదా థామస్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్. పూరి టీమ్ ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ ఫైనల్ చేయాలని యోచనలో ఉన్నట్టు వినికిడి.

ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నకొద్దీ, ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువవుతున్నాయి. పూరి దర్శకత్వం, విజయ్ సేతుపతి నటన, ఆకాష్ పూరి ప్రెజెన్స్‌— ఇవన్నీ కలసి ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories