అప్పట్లో నాకు అది అతి పెద్ద స‌మ‌స్య

టాల్ బ్యూటీ మీనాక్షి చౌదరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి‌తో కలిసి ‘అనగనగా ఒక రాజు’ మూవీలో యాక్ట్‌ చేస్తోంది. అయితే మీనాక్షి.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు అభిమానులతో పంచుకుంది. ఇంతకీ, మీనాక్షి ఏం చెప్పింది అంటే… ‘నా చిన్నతనంలో ఇతరులతో మాట్లాడడానికి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే కాలేజ్ రోజుల్లోనే నా ఎత్తు 6.2 ఉండేది. ఈ కారణంగా నాతో చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు’ అంటూ తెలిపింది.

 ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి అప్పట్లో నా ఎత్తు నాకు అతి పెద్ద స‌మ‌స్య. ఆ సమయంలో నాకు చాలా బాధగా కూడా అనిపించేది. ఇక ఆర్మీ ఆఫీసర్‌ అయిన మా నాన్నకు ఆ విషయం గురించి చెప్తే నీ సమస్యను నువ్వే పరీక్షించుకో అని సలహా ఇచ్చారు. దీంతో అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఇండ‌స్ట్రీకి వచ్చాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఆఫ‌ర్ స‌ద్వినియోగం చేసుకున్నాను’ అని మీనాక్షి చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories