ఆ తేదీనే!

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇప్పటికే దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘రాబిన్‌హుడ్’ మూవీ ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అయితే, ఈ సినిమాతో పాటు నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాను తొలుత శివరాత్రి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు వాయిదా పడటంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఓ సెంటిమెంటల్ డేట్‌ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.

వేసవి కానుకగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ తేదీన రిలీజ్ అయ్యే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అందులో జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, మహానటి, మహర్షి లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆ రోజున రిలీజ్ అయ్యాయి. మరి నిజంగానే ‘తమ్ముడు’ చిత్రం కూడా అదే తేదీన రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.  

Related Posts

Comments

spot_img

Recent Stories