బాలయ్య సినిమాలో ఆ స్టార్‌ హీరో విలన్‌ !

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 109వ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర ప్రేక్షకులను స్టన్ చేస్తుందని చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతుంది.

 కాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా మేకర్స్ ఖరారు చేయలేదు. అయితే, బాలయ్యను ఢీకొట్టేందుకు ఇప్పుడు ఓ హీరో రెడీ అవుతున్నాడనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినపడుతుంది. బాలకృష్ణ తన తరువాత సినిమాని దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెర మీదకి తీసుకుని రానున్నాడు. ఈ సినిమా కోసం బోయపాటి తనదైన స్టైల్‌లో కథను సిద్దం చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండబోతుందని సమాచారం. అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. దీని కోసం ఓ పవర్‌ఫుల్ హీరోను విలన్‌గా తీసుకొచ్చేందుకు బోయపాటి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని కూడా టాక్‌ వినిపిస్తుంది.

ఆ హీరో మరెవరో కాదు.. మ్యాచో స్టార్ గోపీచంద్ అని సమాచారం. ‘జయం’, ‘నిజం’ వంటి సినిమాల్లో విలన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ మ్యాచో స్టార్ ఇప్పుడు మరోసారి విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. బాలయ్యతో విలన్‌గా గోపీచంద్ ఢీకొంటే చూడాలని ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories