ఇప్పటికీ ట్రెండింగ్ లో ఆ పాటే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ప్రకటించగా.. ఇపుడు సినిమా ముగింపు స్టేజ్ లో ఉంది.
అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే పవన్ పాడిన మాట వినాలి సాంగ్ విడుదలకి రాగా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. మొన్న 17న విడుదలకి వచ్చిన ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇలా ఏకంగా 130 గంటలకి పైగా ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది.
మొత్తానికి అయితే పవన్, కీరవాణిల మొదటి సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యిందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తుండగా ఈ మార్చ్ 28న గ్రాండ్ గా విడుదలకి తీసుకురాబోతున్నారు.