ఆ భయం ఉండాలి!

డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్‌.. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా థియేటర్లలో మంచి లాభాలను రాబడుతుంది.  మొదటి ఆట నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ ను అందుకుని మంచి కలెక్షన్స్‌ ను రాబడుతుంది. ఈ క్రమంలోనే సిద్దూ ఓ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు.

టిల్లు స్క్వేర్‌ సినిమాను నేను ఎంతో భయపడుతూ చేశాను. మనం ఏదైనా ఓ పని చేస్తున్నప్పుడు… ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా? అనే ప్రశ్నను మనము మనమే వేసుకోవాలి.అప్పుడే ఔట్‌ పుట్‌ కరెక్ట్ గా వస్తుందని టిల్లు వివరించాడు. డీజే టిల్లు సినిమా చాలా మందికి నచ్చింది.

అలాగే ఈ టిల్లు స్క్వేర్‌  సినిమా కూడా అందరికీ నచ్చుతుందా లేదా అనే భయం నాలో మొదటి రోజు నుంచి ఉంది. ఆ భయంతోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. అలాంటి భయం ఉండాలి కూడా అంటూ సిద్దూ చెప్పుకొచ్చాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories