ఆమె కోసమే..ఆ పాత్ర!

పూరి జగన్నాథ్ తాజాగా విజయ్ సేతుపతిని హీరోగా తీసుకొని ఓ రాజకీయ నేపథ్యంలోని సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా కథనంతా నేటి సమాజానికి అనుసరంగా ఉండబోతుందట. ముఖ్యంగా రాజకీయాలపై పూరి తనదైన శైలిలో సెటైర్లు రాసినట్టు సమాచారం. ఇక బాలీవుడ్‌ నటి విద్యా బాలన్ ఇందులో ఓ ముఖ్యమైన రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె క్యారెక్టర్‌కు బాగా డెప్త్ ఉండేలా పూరి డిజైన్ చేశాడట.

ఇక పూరి గత చిత్రం డబుల్ ఇస్మార్ట్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఆ సినిమా కథ లోతుగా లేదన్న కామెంట్లు వినిపించాయి. అందుకే ఈసారి విజయ్ సేతుపతితో మంచి కంటెంట్ ఉన్న కథను తయారు చేశాడట పూరి. తాజా కథలో పూరి తన మునుపటి సినిమాల మాదిరిగానే ఇంటెన్స్ పాత్రలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పూరి మళ్లీ తన ఫామ్‌లోకి వస్తాడా అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడే మొదలైంది.

Related Posts

Comments

spot_img

Recent Stories