ఆ ఒక్క రాత్రి నన్నెంతగానో మార్చింది!

నాని యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3′ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని తనకు గతంలో జరిగిన ఓ కారు ప్రమాదం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ.. ఆ ప్రమాదం తర్వాత తాను జీవితాన్ని చూసే కోణంలో ఎంతో మార్పు వచ్చింది అంటూ తెలిపారు. ఇంతకీ, నాని ఇంకా ఏం మాట్లాడారు అంటే.. ‘నేను కారు కొనుగోలు చేయడానికి కంటే ముందే నాకొక రోడ్డు ప్రమాదం జరిగింది. నా ఫ్రెండ్‌ కారు తీసుకుని స్నేహితులతో కలిసి హైవేపై డ్రైవ్‌కు వెళ్లా. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని మా కారు ఢీకొట్టింది’ అంటూ నాని చెప్పుకొచ్చారు.

ఈ ప్రమాదం గురించి నాని ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ ప్రమాదం జరిగినప్పుడు రాత్రి సమయం కావడంతో చీకట్లో ఏమీ కనిపించలేదు. మరోవైపు లారీ వెనుక భాగం మా కారులోకి చొచ్చుకొచ్చింది. అద్దం ముక్కలు కావడంతో నా శరీరం మొత్తం రక్తం. మేము అంబులెన్స్‌లో ఆస్పత్రికి వెళ్తున్న టైమ్‌ లో మాకు మరో  ప్రమాదం జరగడం కనపడింది. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ పాపను ఐసీయూలో చేర్పించారు. తనకు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉదయం వరకూ ఆ రూమ్‌ బయటే నిల్చొని ఉన్నా. ఆ ఒక్క రాత్రి నన్నెంతో మార్చేసింది’ అని నాని అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories