చైనాలో రికార్డులు బ్రేక్‌ చేసిన ఆ సినిమా!

కోలీవుడ్ వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు నిథిలన్ సామి నాథన్ తో చేసిన తాజా సినిమా “మహారాజ”. విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళం లో సూపర్ హిట్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాని మేకర్స్ రీసెంట్ గానే చైనా దేశంలో కూడా రిలీజ్‌ చేసారు.

అక్కడ ఏకంగా 40000 స్క్రీన్స్ లో విడుదల చేయగా ఇపుడు ఈ సినిమాకు అక్కడ మంచి ఓపెనింగ్స్ దక్కినట్టుగా వారు ప్రకటించారు. మరి సమాచారం ప్రకారం అయితే అక్కడ ఈ సినిమాకి ప్రీమియర్స్ డే 1 కలిపి 1 మిలియన్ డాలర్లుకి పైగా వసూళ్లు నమోదు అయినట్టు సమాచారం.

దీంతో ఒక సాలిడ్ ఓపెనింగ్ ని ఈ చిత్రం అందుకుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా విజయ్ సేతుపతి కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories