టాలీవుడ్ లో టాప్ కంపోజర్లలో ఒకరిగా నిలిచిన థమన్ ఎస్ తన మ్యూజిక్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత లైఫ్ ఇస్తాయో ప్రేక్షకులు బాగా తెలుసు. కానీ ఈ స్థాయికి చేరుకోవడం ఆయనకి సులభం కాదు. చాలాసార్లు కాపీ ట్యూన్స్ అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో హీరోల అభిమానులు తమ హీరో సినిమాకి థమన్ కాకుండా అనిరుద్ మ్యూజిక్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ట్రెండ్స్ కూడా చేశారు.
అలాంటి పరిస్థితుల్లో కూడా థమన్ వెనక్కి తగ్గకుండా తన పనితోనే సమాధానం చెప్పాడు. తనపై నమ్మకం లేని వాళ్లకే తిరిగి తన మ్యూజిక్ తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఉదాహరణకి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సమయంలో ఆయన ఇచ్చిన ఆల్బమ్ పెద్ద సక్సెస్ అయ్యింది. అది మహేష్ కెరీర్ లోనే మ్యూజిక్ పరంగా బలమైన హిట్ గా నిలిచింది.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజి కోసం థమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్కో పాట విడుదలవుతున్న కొద్దీ పవన్ అభిమానులు మత్తెక్కిపోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు థమన్ వద్దు అని చెప్పిన వాళ్లే ఇప్పుడు ఆయన పనిని ప్రశంసిస్తున్నారు.