ప్రేమమ్, అఆ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఉంగరాల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్. కొద్ది కాలంలోనే కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటి వరకు క్యూట్ క్యూట్ పాత్రలతో మెప్పించిన అనుపమ… టిల్లు స్క్వేర్ చిత్రంలో రొమాన్స్, ముద్దులతో రెచ్చిపోయింది. ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ట్రైలర్స్ తోనే అనుపమ తన హాట్ నెస్ తో అందరికి హిట్ పుట్టిస్తుంది.
టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29 న విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది చిత్రబృందం.ఈ క్రమంలోనే అనుపమ ఎక్కడికి వెళ్లినా ముందుగా అడుగుతున్న ప్రశ్న..సినిమాలో ఆమె రొమాన్స్ గురించే… దీని గురించి అనుపమ మాట్లాడుతూ.. రొమాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. సెట్లో 100 మంది ముందు సీన్ చేయడమంటే చాలా కష్టమైన పని. అందరూ కూడా కార్ సీన్ గురించి అడుగుతున్నారు… అసలు ఆ టైంలో నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అంటే.. మాటల్లో చెప్పలేనిది.
దాంట్లోంచి బయటకు రావడం చాలా కష్టం. అయినా సరే మనం బాగా నటించాల్సిందే.రొమాన్స్ అనేది ఎంజాయ్ చేసినట్లు చేయాలి. సీన్ ని పండించాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. అది అంత ఈజీ కాదు. చూసిన వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు.. కానీ అది కరెక్ట్ కాదు. దీంతో రొమాన్స్ సీన్స్ చేసేటప్పుడు నటులు ఎంత ఇబ్బంది పడతారో అనుపమ చెప్పుకొచ్చింది.