మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఐతే, ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ ఉండదని తెలుస్తోంది. పైగా అనిల్ రావిపూడి, ఈ చిత్రాన్ని గ్యాంగ్ లీడర్ తరహాలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, చిరంజీవి పాత్రకి ప్రత్యేకమైన యాస మరియు బాడీ లాంగ్వేజ్‌ను డిజైన్ చేశారట. అదేవిధంగా సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి ఈ వార్త మెగా అభిమానులను ఉత్సాహపరుస్తుంది.
కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు. అయితే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం.
అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.