ఆ డైరెక్టర్‌ అరెస్ట్‌!

మోనాలిసా.. ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ తెచ్చుకున్న అతి సాధారణ సెన్సేషనల్ బ్యూటీ. అయితే, సడెన్ గా సెన్సేషన్‌గా మారిన మోనాలిసాకి సినిమా ఆఫర్ ఇచ్చాడు దర్శకుడు సనోజ్ మిశ్రా. తాజాగా ఆయనకు షాక్ తగిలింది. రేప్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డైరెక్టర్ లైంగికంగా వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది.

ఇక ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ పేరుతో తెరకెక్కించే సినిమాలో మోనాలిసాను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు సనోజ్ ప్రకటించారు. ఇక మోనాలిసా విషయానికి వస్తే.. ఇంటర్వ్యూస్ కోసం నిత్యం మీడియా వెంట పడుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే మోనాలిసా కూడా రోజూ ఏవో ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది.

ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పింది. తాను హీరోయిన్ గా వారి స్థాయికి చేరుకోవాలని ఆమె ప్లాన్ చేసుకుంటుందట. అంతేకాకుండా తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని, ఆయనతో తన ప్రయాణం బాగుందని.. ఆయన వల్ల తనకు చాలా మేలు జరిగినట్లు ఆమె వివరించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories