ఆ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కి ఆ డైరెక్టర్‌ ఓకే!

టాలీవుడ్‌ లో సక్సెస్‌ అందుకున్న చాలా మంది దర్శకులు వరుస ఫ్లాపుల కారణంగా కనిపించకుండపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, వారిలో కొందరు మాత్రమే మళ్లీ సాలిడ్ కమ్‌బ్యాక్‌తో తిరిగి సక్సెస్ సాధించి తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లారు. కానీ, ఇంకా కొందరు తమకు సరైన కమ్‌బ్యాక్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

వారిలో దర్శకుడు కరుణాకరణ్ కూడా ఒకరు. తొలిప్రేమ, వాసు, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన కరుణాకరణ్ ప్రస్తుతం ఓ సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

ఆయన నుంచి వచ్చిన లాస్ట్ సూపర్‌ హిట్ సినిమా ‘డార్లింగ్’. ఆ తరువాత ఆయన కొన్నిసినిమాలు ఫ్లాప్స్ వరుసగా ఇచ్చారు. ఇక కరుణాకరణ్ డైరెక్ట్ చేసిన లాస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్ యు’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఆయన ఓ మంచి కథను రెడీ చేస్తున్నాడని, దీనిని ఓ స్టార్ ప్రొడ్యూసర్‌కి వినిపించగా ఆయన ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఓకే చెప్పినట్లు టాక్‌ వినిపిస్తుంది.

ఇక ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కరుణాకరణ్ చెప్పిన కథ దిల్ రాజుకి నచ్చడంతో, ఇప్పుడు ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుస్తుంది.  ఇక ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినపడుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories