అనసూయ భరద్వాజ్ టీవీ రంగం నుంచి సినిమాల వైపు వచ్చాక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఇక తాజాగా ఆమె తన కొత్త ఇంటిలోకి వెళ్లింది. ఆ సందర్భాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని పూజా కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ వేడుకలో హనుమంతుని ప్రభావం కనిపించిందని అనసూయ భావోద్వేగంగా షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి హనుమంతునిపై గాఢమైన భక్తి ఉందని, తన తండ్రి చెప్పిన మాటలు జీవితంలో ఎంతో ప్రభావితం చేశాయని చెప్పింది. ఏ పని మొదలుపెట్టినా హనుమంతుడిని స్మరించకుండా చేయకూడదని ఆమె తండ్రి చెప్పినదాన్ని గుర్తు చేసుకుంది.
తన కొత్త ఇంటికి ‘సంజీవని’ అనే పేరు పెట్టాలనుకున్నానని, కానీ గురువు సలహాతో ‘రామ సంజీవని’ అని పేరు పెట్టినట్లు తెలిపింది. హనుమంతుడు ఎక్కడున్నా అక్కడ రాముడి పేరు ఉండాల్సిందేనని భావనతోనే ఆ పేరు పెట్టినట్లు చెప్పింది. అంతేకాదు, పూజ సమయానికి హనుమంతుడి ఒక విభిన్న రూపం ఫోటో ఒకటి గురువు చూపించారని, అది చూసినప్పుడు తన ఆనందానికి అవధులే లేవని అనసూయ తెలిపింది. ఇది తన ఇంటికి హనుమంతుడి ఆహ్వానం లాంటిదే అనిపించిందని తెలిపింది