ఓజీలో ఆ హాస్య నటుడు..నిజమేనా?

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ – హాస్యనటుడు అలీ మధ్య మంచి స్నేహం ఉండేదన్న సంగతి తెలిసిందే. ఐతే, రాజకీయాల వల్ల వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది’. ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అలీ ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

పవన్ – అలీ కలయికలో వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్టైన్ గా ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ సినిమా లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పార్ట్-1విడుదల తర్వాత రెండో పార్ట్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నట్లు మూవీ మేకర్స్‌ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories