ఆ వరం- అచ్చంగా చంద్రబాబు సర్కారు ఖాతాలోకే!

రాబోయే అయిదేళ్లలో విద్య్తుత్తు చార్జీలను పెంచబోయేది లేదు.. అని చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలోనే చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ మాటను ఆయన చాలా ఘనంగా నిలబెట్టుకున్నారు. ఈఆర్సీ విద్యుత్తు చార్జీల కొత్త టారిఫ్ లను ప్రకటించినది గానీ.. చార్జీల పెంపు మాత్రం ఉండదని స్పష్టం చేసింది. విద్యుత్తు సంస్థలకు పడే అదనపు భారాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈఆర్సీ పేర్కొంది. అంటే.. విద్యుత్తు చార్జీల భారం ఖచ్చితంగా పెరుగుతోంది.. కాకపోతే.. పెరుగుతున్న భారం.. ప్రజల మీదికి మళ్లకుండా, ప్రభుత్వమే మోయబోతోంది. ఈ ఏర్పాటు అచ్చంగా చంద్రబాబునాయుడు సర్కారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వరంగా భావించాల్సిందే. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టుగా చెప్పుకోవాల్సిందే.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం అయిదేళ్ల కాలంలోనే విద్యుత్తు చార్జీలు పలుమార్లు పెరిగాయి. చార్జీల బాదుడుతో ప్రజల నడ్డి విరిచారు. కరెంటు వినియోగం అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దుర్మార్గమైన పరిస్థితుల నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు.. ఎన్నికల ప్రచార సమయంలో నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. తమ కూటమిని గెలిపిస్తే అయిదేళ్లపాటు చార్జీల పెంపు ఉండదని అన్నారు.
కానీ గెలిచిన తర్వాత.. రెండు సార్లు విద్యుత్తు చార్జీలను సవరించారు. అదేదో చంద్రబాబు చేసిన పాపం లాగా జగన్ దళాలు ప్రచారం చేయడానికి ప్రయత్నించాయి గానీ.. జగన్ ప్రభుత్వ కాలంలో నిర్ణయాలకారణంగానే సవరింపులు జరిగినట్టుగా బయటకు వచ్చిన తర్వాత మౌనం పాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈఆర్‌సీ కొత్త టారిఫ్ లను ప్రకటించింది.

డిస్కంల ఖర్చులు, ఆదాయాల మధ్య తేడా దాదాపు 12వేల కోట్లరూపాయలకు పైగా ఉండబోతోంది. ఆ భారంలో ఒక్క రూపాయి కూడా ప్రజల మీద వేయకుండా భరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం వల్ల మాత్రమే ఇలా చార్జీలు పెరగడం లేదు. విద్యుత్తు చార్జీలను ఎడా పెడా అనేకమార్లు వడ్డించడమే పరిపాలన అనుకున్న జగన్ దళాలు.. ఇప్పుడు ఏం చెబుతాయో చూడాలి. మిర్చి రైతులను పరామర్శించే పేరుతో ఒక డ్రామా నడిపించిన తరువాత.. తన సెక్యూరిటీ గురించి తప్ప మరో మాట్లాడకుండా చెలరేగుతున్న జగన్.. ఇలాంటి నిర్ణయాలు చూసి ప్రజా రంజక ఎడ్మినిస్ట్రేషన్ ఎలాగో తెలుసుకోవాలని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories