సాంగ్‌ ప్రొమో ఎప్పుడంటే!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను డైరెక్టర్‌ చందు మొండేటి రూపొందిస్తుండడంతో ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి’ సాంగ్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సింగిల్ పాటగా ‘నమో నమ: శివాయ’ అనే పాటను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటను జనవరి 4న సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సాంగ్ ప్రోమోను జనవరి 3న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories