గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ సినిమా “గేమ్ ఛేంజర్”. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయి అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా విడుదలకి ముందు వరకు డైరెక్టర్ శంకర్ తో పాటు మిగతా టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమాలో పలు హైలైట్స్ ని బాగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
మరి వీరిలో సంగీత దర్శకుడు థమన్ కూడా ఉన్నాడు. అయితే ఇపుడు థమన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పడం అనేది సంచలనంగా మారింది. సినిమా విడుదలకి ముందు సినిమాలో పాటలు వేరే లెవెల్లో ఉంటాయని మెయిన్ గా జరగండి సాంగ్ ఒక్క దానికే ఆడియెన్స్ పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయి అని చెప్పుకొచ్చాడు. కానీ రీసెంట్ పాడ్ కాస్ట్ లో తన కామెంట్స్ ఊహించని విధంగా ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సాంగ్స్ అంత హిట్ కాకపోవడానికి కారణం ఒక్క సాంగ్ లో కూడా సరైన హుక్ స్టెప్ లేదని అల వైకుంఠపురములో సినిమాకి ప్రతీ సాంగ్ లో ఒక హుక్ స్టెప్ ఉంది. కానీ గేమ్ ఛేంజర్ కి అలాంటివి లేవు అంటూ చెప్పుకొచ్చాడు. దీనితో రిలీజ్ ముందు అన్ని మాటలు మాట్లాడి ఇపుడు ఇలా కామెంట్స్ చేయడంపై తనపై సోషల్ మీడియాలో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.