తారక్, చరణ్ ను కలిపిన థమన్!

టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ మధ్య ఉన్న బాండింగ్‌ గురించి తెలిసిందే.ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత వీళ్ల ఫ్రెండ్షిప్‌ నెక్స్ట్‌ లెవెల్‌కి వెళ్లింది. సినిమా సమయంలో రామ్‌ చరణ్‌, ఎన్టీర్‌ ఇద్దరూ తరచూ కలిసి కనిపిస్తూ తమ ఫ్రెండ్‌షిప్‌ అందరికీ చాటిచెప్పారు.
సినిమా విడుదల నుండి ఆస్కార్ వేడుకల వరకు వారిద్దరూ కలిసే ఉన్నారు. ఆ తరువాత, మళ్ళీ కలిసి కనిపించింది చాలా తక్కువ. అయితే, సంగీత దర్శకుడు తమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్‌ చేసుకున్నారు.

తమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ..’దోప్ మూమెంట్.. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్’ అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఇటీవల అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, తమన్ ఈ వేడుక కోసం అమెరికా వెళ్లారు.ఇప్పుడు తమన్ ఈ ఫోటోను షేర్ చేయడంతో ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే తమన్ షేర్ చేసిన పిక్ అమెరికాలో దిగింది. అందులో తారక్ ఉండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.’వార్ 2′ షూటింగ్ తో ముంబైలో బిజీగా ఉండాల్సిన ఎన్టీఆర్.. అమెరికాలో ఏం చేస్తున్నాడని ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా చరణ్, తారక్ ఇలా చాల రోజులకు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories