పదేళ్లు పూర్తి అయ్యాయి.. రీరిలీజ్‌ కు సిద్దం!

నటసింహాం బాలయ్య బాబు గురించి తెలియని వారు ఉండరు. ఆయన డైలాగ్‌, యాక్షన్‌ సినిమాలంటే మాస్‌ మంచి క్రేజ్‌ ఉంది. ఈ క్రమంలో ఆయన బోయపాటి లాంటి డైరెక్టర్ తో కలిస్తే ఇక కాంబో గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రికార్డులు తిరగరాయడమే వారి పని. ఈ క్రేజీ కాంబోలో మూడు సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆలరించాయి.

ఈ క్రమంలోనే వారి నుంచి వచ్చిన చిత్రమే లెజెండ్‌ .. ఈ సినిమా వచ్చి మార్చి 28కి పది సంవత్సరాలు పూర్తి అవుతుంది. దీంతో ఈ చిత్ర మేకర్స్‌ ఈ సినిమాను మరోసారి థియేటర్లలోకి విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్‌ ట్రైలర్‌ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

లెజెండ్‌ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలయ్య డబుల్‌ రోల్‌ లో ఈ సినిమాలో తన నట విశ్వ రూపాన్ని చూపించారు. ఈ సినిమాలోని ఫైట్లు కూడా ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి డీఎస్పీ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జగపతి బాబు అయితే.. నేడు క్షణం తీరిక లేని యాక్టర్ గా మారిపోయారు.

Related Posts

Comments

spot_img

Recent Stories